Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుత ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కుతున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే బాబి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బాబి ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో భాగంగా డైరెక్టర్ బాబీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని డైలాగ్స్ రాసి తన టీం చేత బాలయ్య వద్దకు పంపించారట. ఈ డైలాగ్స్ ఒకసారి చూసి వారి అభిప్రాయం ఏంటో తెలియజేయాలని డైరెక్టర్ బాబి సూచించారు. అయితే తన టీం బాలకృష్ణ దగ్గరికి ఈ డైలాగ్స్ తీసుకెళ్లడంతో వాటిని చూసినటువంటి బాలయ్య ఉగ్ర నరసింహుడై తన టీం పై సీరియస్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.
స్క్రిప్ట్ విషయంలో సీరియస్ అయిన బాలయ్య…
ఈ విధంగా ఈ డైలాగ్స్ చూసినటువంటి బాలకృష్ణ డైరెక్టర్ బాబి తో పాటు ఆయన టీం పై కూడా సీరియస్ అయ్యారని, డైలాగ్స్ తన మేనరిజానికి అనుగుణంగా లేకపోవడంతోనే బాలకృష్ణ ఇలా సీరియస్ అయ్యారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలకృష్ణ , బాబీ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. సాధారణంగా బాలకృష్ణ ఎవరిని తొందరగా ఏమీ అనరు ముఖ్యంగా డైరెక్టర్ల విషయంలో ఈయన చాలా కూల్ గా ఉంటారు డైరెక్టర్లు చెప్పినది మాత్రమే చేస్తుంటారు స్క్రిప్ట్ విషయంలో కూడా ఎలాంటి సలహాలు కూడా ఇవ్వరు అలాంటి బాలకృష్ణ డైరెక్టర్ పై సీరియస్ అయ్యారు అనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.