Nani : రేంజ్ తగ్గిందా..? ఫ్లాప్ డైరెక్టర్సే దిక్కయ్యారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, నెటిజన్స్ కొందరు ఇలా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం మన నేచురల్ స్టార్‌కి భారీ కమర్షియల్ హిట్ వచ్చి చాలా కాలం అయింది. నిన్నుకోరి తర్వాత వరుసగా ఫ్లాపులు చూస్తూ వస్తున్న నానికి అంతే వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. మినిమం గ్యారెంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నాని నిర్మాతలకి సేఫ్ హీరోగా కనిపిస్తున్నాడు. అందుకే, నిర్మాతలు అసలు వెనకడుగు వేయడం లేదు.
అయితే, ఆశించిన విజయాలను అందుకోవడంలో నాని బాగా వెనకబడిపోయాడు. గత చిత్రాలు టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ కూడా ఓ రకంగా అంత కమర్షియల్ సక్సెస్ కాదనే చెప్పాలి. అయితే, శ్యామ్ సింగరాయ్ కొంతవరకు నానీకి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం దసరా అనే సినిమాను చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది నాని కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.

Nani : సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి నానా తంటాలు పడుతున్న నాని..
అయితే, ఈ సినిమా నానికి పాన్ ఇండియా స్టార్‌గా ఏమాత్రం క్రేజ్ తెస్తుందో అని కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కూడా గత చిత్రాల ట్రాక్ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి నానా తంటాలు పడుతున్న నాని..ప్రయోగాలను మాత్రం వదలడం లేదు. పెద్ద దర్శకులెవరూ తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనో ఏమోగానీ, ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇతకముందు నానికి కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఫ్లాపిచ్చిన మేర్లపాక గాంధీకి ఇప్పుడు నాని ఒకే చెప్పాడట. మరి ఇది ఎంతవరకు నిజమోగానీ, నెటిజన్స్ మాత్రం మరోలా కామెంట్స్ చేస్తున్నారు.