Naresh Ex Wife: నటుడు నరేష్ గత కొద్ది రోజులుగా వ్యక్తిగత విషయాలు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఇప్పటికే నరేష్ ముగ్గురిని పెళ్లి చేసుకుని ముగ్గురికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై పవిత్ర లోకేష్ క్లారిటీ ఇస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే నరేష్ మూడవ భార్య రమ్యా రఘుపతి ఎంట్రీ ఇస్తూ తనకి ఇంకా అధికారికంగా విడాకులు రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ తో తనకు గొడవలు ఉన్నాయన్నమాట వాస్తవమే మా పెళ్లి జరిగిన తర్వాత ఆయనకు ఇతర మహిళలతో సంబంధం ఉందనే విషయం తెలిసి మా మధ్య గొడవలు జరిగేవి. ఈ విషయం మా అత్తయ్య విజయనిర్మల గారికి కూడా తెలుసు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే ఆయన అవన్నీ ఒట్టి పుకార్లేనని చెబుతూ క్షమించమని కోరేవారు. బాబు కోసం నేను అన్ని భరించానని రమ్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే తాజాగా ఈమె ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు.

Naresh Ex Wife: ఈ విషయాలన్ని విజయనిర్మల గారికి కూడా తెలుసు…
ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ కు ఇతర మహిళలతో సంబంధం ఉండటం వల్ల ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు తనతో గొడవలు జరిగేవని అయితే మా మధ్య గొడవలు రావడంతో ఆయన నాకు విడాకుల నోటీస్ పంపించారని రమ్య ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఆయన టేబుల్ పై గన్ను పెట్టి తనని విడాకులపై సంతకం చేయాలని బెదిరించారని రమ్య ఈ సందర్భంగా వెల్లడించారు.ఆయన తనని బెదిరించి విడాకులు కావాలని కోరారని అయితే ఇప్పటికీ విడాకులు కేసు కోర్టులో ఉందని అధికారికంగా నరేష్ తో నాకు ఇప్పటివరకు విడాకులు రాలేదంటూ ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. విడాకుల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.