Nataraj Master: నటరాజ్ మాస్టర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఓటీటీ వెర్షన్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో మొన్నటి వరకు ఒక రేంజ్ లో హడావుడి చేశాడు. తమ తనదైన స్టైల్లో హౌస్ లో తన సత్తా చాటుకున్నాడు. అయినప్పటికీ నటరాజ్ మాస్టర్ హౌస్ కి గుడ్ బై చెప్పక తప్పలేదు.
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం యాంకర్ రవి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నటరాజ్ మాస్టర్. నిజానికి ఈ ఇంటర్వ్యూ గతంలో జరిగిన కంటెస్టెంట్ ల కంటే కొంచెం భిన్నంగా గా ఉంది. యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో నటరాజ్ మాస్టర్ కి తనకి జరిగిన క్లాష్ ను గుర్తుపెట్టుకుని నటరాజ్ మాస్టర్ ని రవి ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.
ఇక మాస్టర్ కూడా యాంకర్ రవి కి తగ్గట్టుగానే ఇచ్చి పడేసాడు. దీని కారణంగా నటరాజు మాస్టర్ మాట్లాడుతూ మా బ్రదర్ కి ఫోన్ చేసి రవిని అడిగారు. నువ్వు సీజన్ ఫైవ్ నీ మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడట. మరి నా ఇంట్లో వాళ్ళు ఫిల్ అవ్వలేదా..నన్ను గుంటనక్క అన్నందుకు అని రవి చెప్పాడని నటరాజ్ మాస్టర్ తెలిపాడు.

Nataraj Master: యాంకర్ రవి ఈమె దగ్గరే డబ్బులు తీసుకుంటున్నాడట..
ఇక రవిని నేను గుంట నక్క అన్నాను కానీ.. ఆ తర్వాత ఏమీ అనలేదు. చాలాసార్లు పార్టీ లో కలిసాం గుంటనక్క అని భలే పేరు పెట్టావ్ అని కూడా అన్నాడు. ఇక హామీద దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకు పీఆర్ చేస్తున్నాడని మాస్టర్ వెల్లడించాడు. ఇక హమీద పిఆర్, వేల కామెంట్స్ అన్ని యాంకర్ రవి రాయిస్తున్నాడని నటరాజ్ మాస్టర్ తెలిపాడు.