Nataraj Master: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిందుమాధవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ్ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో హీరో రామ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
మొత్తానికి బిందు మాధవి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో హడావిడి చేసిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను తన సొంతం చేసుకుంది ఈ అమ్మడు. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ గణనీయంగానే ముగిసింది. కానీ కంటెస్టెంట్ ల మధ్య పెరిగిన గొడవ మాత్రం ఇప్పటి వరకు తగ్గలేదు.
ఇక హౌస్ లో అందరి కంటెస్టెంట్ లను పక్కన పెడితే బిందుమాధవి విషయంలో నటరాజ్ మాస్టర్ మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ బిందుమాధవి టీం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. హౌస్ లో బిందుమాధవి టీం విషయంలో ఎన్నో రకాల విషయాలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో బిందుమాధవి గురించి ఒక అద్భుతమైన సీక్రెట్ ను కూడా నటరాజు మాస్టర్ బయటపెట్టాడు.

Nataraj Master: నటరాజ్ మాస్టర్ బయటపెట్టిన బిందు మాధవి గుట్టు ఇదే!
తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఆమె అక్కడ హోస్ట్ కమలాహాసన్ గారు తెలుగులో మాట్లాడినా.. సరే అని సమాధానం చెప్పుకొచ్చినట్లు తెలిపాడు. అంతేకాకుండా హౌస్ లో సిగరెట్ కూడా తాగి గుడ్డు పగలగొట్టి వాసన రాకుండా చేసిందని నటరాజ్ మాస్టర్ బిందు మాధవి గుట్టును బయట పెట్టాడు. ఈ విషయంలో బిందు మాధవి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.