Nayan – Vignesh: నయన్-విఘ్నేష్ ఆ రూ.100 కోట్లు ఎక్కడివి..?

G K

Nayan – Vignesh: నయన్-విఘ్నేష్ ఆ రూ.100 కోట్లు ఎక్కడివి..? అంటూ నెటిజన్స్ ఇప్పుడు ఈ స్టార్ కపుల్‌ను అడుగుతున్నారట. కోలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ కపుల్ అంటే నయనతార, విఘ్నేష్ శివన్. గత కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పలు వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందుకు కారణం నయనతార అప్పటికే తమిళ హీరో శింబు ప్రేమలో పీకల్లోతులో మునిగి తేలింది. వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారనగానే సడన్‌గా ట్విస్ట్ ఇచ్చారు.

ఇద్దరం విడిపోతున్నామని అఫీషియల్‌గానే కన్ ఫర్మ్ చేశారు. ఆ తర్వా ప్రముఖ కొరియోగ్రాఫర్ – డైరెక్టర్ ప్రభుదేవాతోనూ కొంతకాలం ప్రేమాయణం సాగించి అతనితోనూ బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఆ తర్వాత ప్రేమలో పడ్డ విఘ్నేష్ శివన్‌తో ఎంతకాలం కలిసి ఉంటుందో అని అందరిలోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రేమలో ఉన్నామని చెప్పారు గానీ..పెళ్ళెప్పుడో మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని నయన్ జంట తెలిపింది.

Nayan - Vignesh: నయన్-విఘ్నేష్ ఆ రూ.100 కోట్లు ఎక్కడివి..?
Nayan – Vignesh: నయన్-విఘ్నేష్ ఆ రూ.100 కోట్లు ఎక్కడివి..?

Nayan – Vignesh: ఈ స్టార్ కపుల్ విదేశాలలో దాదాపు రూ. 100 కోట్ల పెట్టుబడి..?

అయితే, ఇలా ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత కూడా రష్మిక మందన్న, మరో యంగ్ బ్యూటీ సినిమా కెరీర్ కోసం క్యాన్సిల్ చేసుకున్నారు. అదే సందేహాలు వీరి మీద కలిగాయి. అదలా ఉంటే ఇప్పుడు ఈ స్టార్ కపుల్ విదేశాలలో దాదాపు రూ. 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఓ పెద్ద ఆయిల్ కంపెనీలో ఇలా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారట. మరి రూ. 100 కోట్ల సంపాదన ఎలా వచ్చిందనే కామెంట్స్ నెటిజన్స్ చేస్తున్నారు. అయితే, హీరోయిన్‌గా నయనతార భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ కూడా నటుడిగా.. దర్శక, నిర్మాతగా సక్సెస్ బాగా సంపాదించాడు. ఇలాంటి స్టార్స్ వద్ద
రూ.100 లేకపోవడం ఏంటీ ..అది చాలా తక్కువే.. అని ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈ స్టార్ కపుల్ భారీ పెట్టుబడులతో బిజినెస్‌లోకి దిగడం మాత్రం ఆసక్తికరంగా
మారింది.

- Advertisement -