Nayanatara: సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే మొదటిసారి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి జవాన్ సినిమా ద్వారా అడుగు పెట్టబోతున్నారు.షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు..
ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఒక నేటిజన్ షారుఖ్ ఖాన్ ను ప్రశ్నిస్తూ…మీరు జవాన్ సినిమా షూటింగ్ సమయంలో నయనతారతో ప్రేమలో పడ్డారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు షారుక్ సైతం తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.

Nayanatara: ఇద్దరు పిల్లలకు తల్లి…
ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు షారుక్ సమాధానం చెబుతూ.. నోర్మూయ్ నయనతార ఇద్దరు పిల్లలకి తల్లి అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఇలా నయనతార విషయం గురించి నేటిజన్ అడిగిన ప్రశ్నకు షారుక్ ఈ విధమైనటువంటి సమాధానం చెప్పడంతో సదరు నెటిజన్ కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఇక నయనతార ఇదివరకు ఎంతోమంది హీరోలతో ప్రేమ వ్యవహారాల వల్ల వార్తలో నిలిచినప్పటికీ ఈమె మాత్రం డైరెక్టర్ విగ్నేష్ నుగత ఏడాది వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా తల్లిగా మారిపోయారు ఇలా తల్లిగా పిల్లల బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.