Nayanatara: ఒకప్పుడు ప్రేమించుకున్న వారు విడిపోవడం లేదా పెళ్లి చేసుకొని విడిపోతే అదో పెద్ద నేరంగా భావించేవారు. ప్రస్తుత కాలంలో ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడం సర్వసాధారణం అయింది ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఎంత త్వరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకోవడం పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకోవడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లయి పిల్లలు పెళ్లీడుకొచ్చిన విడాకులు తీసుకొని విడిపోతున్న సందర్భాలు తలెత్తుతున్నాయి.ఇక మరి కొంతమంది ఇద్దరు ముగ్గురితో ప్రేమ వ్యవహారాలు నడిపి చివరికి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు.
ఇలాంటి కోవలోకే వస్తారు లేడీ సూపర్ స్టార్ నయనతార. నయనతార దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె పలువురు హీరోలతో భారీ స్థాయిలో ప్రేమ వ్యవహారాలను నడిపారని చెప్పాలి కెరియర్ మొదట్లో ఈమె నటుడు శింబుతో ప్రేమ ప్రయాణం చేశారు. ఇక వీరిద్దరూ ఒకరినొకరు లిప్ లాక్ చేసుకున్నటువంటి ఫోటోలు కూడా బహిరంగంగా బయటకు రావడంతో అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఇక వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ కన్ఫామ్ ఐతే చివరికి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
Nayanatara: ఉదయనిది స్టాలిన్ తో సహజీవనం…
ఇలా ఈ హీరోతో బ్రేకప్ అయిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నయనతార కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. ఇక నయనతార ప్రేమలో పడిన ప్రభుదేవా ఏకంగా తన భార్యకు కూడా విడాకులు ఇచ్చారు.ఇక ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకొని తిరగడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ఈయనతో ఏడేళ్లపాటు సహజీవనం చేసిన నయనతార చివరికి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయి జీవితంలో సెటిల్ అయ్యారు. అయితే తాజాగా బీజేపీ నేత ధారా రవి నయనతార గురించి మాట్లాడుతూ ఈమె ప్రస్తుత తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ తో సహజీవనం చేస్తూ తనతో ప్రేమ కహానీలు జరిపారని వెల్లడించారు. ఈ విషయం తాను బయటకు చెప్పినందుకే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ధారా రవి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.