Nayanatara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకొని సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
అయితే వివాహం జరిగి ఏడాది కూడా పూర్తికాకుండానే ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కనటంపై పెద్ద వివాదం చెలరేగింది. నిబంధనలకు విరుద్ధంగా నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు సరోగసీ విధానాన్ని ఆశ్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై విచారణ కమిటీకి ఆదేశించింది. తాజగా కమిటీ బుధవారం తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో నయనతార విగ్నేష్ 2016 లోనే వివాహం చేసుకున్నట్లు నిరూపణ అయింది. అంతేకాకుండా సరోగసి వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు నిరూపణ అయింది. దీంతో ఈ వివాదం నుండి నయన్ దంపతులకు విముక్తి లభించింది.
Nayanatara:తమ ప్రాణం ప్రపంచం పిల్లలే..
ఇక తాజాగా విగ్నేశ్ తన ఇద్దరు పిల్లల పేర్లు ప్రకటించాడు. నయన్ దంపతులు తమ ఇద్దరి పిల్లలకు ‘ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్’, ‘ఉలగ్ దైవిక్ ఎన్ శివన్’ అని పేర్లు పెట్టారు. తమిళం లో ఉయిర్ అంటే ప్రాణం అని, ఉలగం అంటే ప్రపంచం అని అర్థం. అంటే తమ ప్రాణం, ప్రపంచం అంతా పిల్లలే అని అర్థం వచ్చేలా వారు పిల్లలకు ఈ పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరూ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా విగ్నేష్ షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.