Nayanatara: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత సార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు తమిళ్ భాషలలో వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటిస్తున్న నయనతార ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది.కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన నయనతార ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ అమ్మడు ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న నయనతార సినిమాల ద్వారా అధిక మొత్తంలో ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కొక్క సినిమాకి రూ. 8 నుండి రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటివరకు నయన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.
Nayanatara: వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టిన నయన్…
హైదరాబాద్, చెన్నై,కేరళలో నయనతారకు కోట్లు విలువ చేసే ఖరీదైన బంగ్లాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొచ్చిలో తన తల్లిదండ్రుల కోసం మరొక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కూడా నయనతారకు 20 కోట్ల విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే విఘ్నేష్ శివన్ తో పెళ్ళి జరిగిన తర్వాత ఒక ప్రైవేట్ జెట్ ని కూడా కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా నయనతార ఆస్తుల గురించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.