Nayanatara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న నయనతార తెలుగు తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇంతకాలం తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న తర్వాత నయన్ సినిమాలకు దూరం అవుతుందని అందరూ భావించారు కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన నయనతార నటించిన జవాన్ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా నయనతారకి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నయనతార గురించి ఆమె భర్త విగ్నేష్ శివన్ కి జాగ్రత్తలు చెబుతూ షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nayanatara: విగ్నేష్ కు సలహాలు ఇచ్చిన షారుక్…
ఇటీవల ‘ జవాన్’ ట్రైలర్ చూసిన విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ..’అట్లీ ఇలాంటి సూపర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం గర్వంగా ఉంది. ఔట్‌ఫుట్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. హ్యాట్యాఫ్’ అని పోస్ట్ పెట్టాడు. అలానే జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నందుకు నయనతార, అనిరుధ్, విజయ్ సేతుపతికి విషెస్ చెప్పాడు. ఇక విఘ్నేశ్ పోస్ట్ చూసిన షారుక్ స్పందిస్తు ‘విఘ్నేశ్ శివన్ చూపిన ప్రేమకు థ్యాంక్స్. నయనతార అద్భుతంగా చేసింది. కానీ జాగ్రత్త. ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది’ అని షారుక్ ఫన్నీగా విఘ్నేశ్‌కి జాగ్రత్తలు చెబుతూ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.