Nayantara: తెలుగు సినీ ప్రియులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత లక్ష్మి సినిమా తో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుతుంది. ఆపై పలువురు స్టార్ హీరోల సరసన ప్రకటించి నటనలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది.
ఇక తన అందంతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక నైన తారకు కోలీవుడ్లో బాగానే ఆదరణ ఉంది. ప్రస్తుతం కొలీవుడ్ లోనే చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయింది ఈ అమ్మడు. ఇక నయనతార కొలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. కాగా వీరిద్దరి ర్యాపో ప్రస్తుతం పెళ్లి వరకు వచ్చింది. ఇక జూన్ 9న వీళ్లిద్దరు చిన్నతిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ జంట పలు వెకేషన్ లకు, ట్రిప్ లకు వెళుతూ ఆ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇక తాజాగా నయనతార కులదైవం గుడిలో పూజల జరిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్ తో కలిసి నయనతార ఆ పూజలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. తంజావూరులో పాపానశంలో మేల్ మరతురు గ్రామంలో ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నట్లు కనిపిస్తుంది.

Nayantara: నయనతారపై నెటిజన్లు ఈ విధంగా చెవులు కొరుక్కుంటున్నారు!
ఆ ఆలయంలో ఈ జంట అనేక పూజా కార్యక్రమాలతో పొంగలి పెట్టి జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఇది గమనించిన నెటిజన్లు ఆమె జాతకం బాగుండక పోవడం వల్లే అక్కడ పూజలు చేస్తున్నారా? ఆ పూజలు జరిపించకపోతే నయనతార పెళ్లి విషయం లో మళ్ళీ బ్రేక్ అప్ జరుగుతుందా అని నెటిజన్లు నానా రకాలుగా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట కు సంబంధించిన ఫోటో ఒకటి ట్విట్టర్ ఖాతాలో వైరల్ గా మారింది.