Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార కేవలం తన సినిమా పనుల వరకు మాత్రమే బిజీగా ఉండేవారు అయితే ఈమె ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండే వారు కూడా కాదు. ఇలా సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు.
నయనతార తన ఇద్దరు కొడుకులను ఎత్తుకొని సన్ గ్లాసెస్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో నడుస్తూ వస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ నేను వచ్చాను అని చెప్పు అనే డైలాగ్ తో ఉన్నటువంటి వీడియోని ఈమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనంతరం జవాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇలా నయనతార ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన 24 గంటల వ్యవధిలోనే ఈమెకు ఏకంగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇక నయనతార కూడా 18 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు.
సమంతను మాత్రమే ఫాలో అవుతున్న నయన్.. ఇలా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఫాలో అవుతున్నటువంటి నయనతార ఒకే ఒక టాలీవుడ్ హీరోయిన్ ని ఫాలో అవుతున్నారు. మరి సమంత ఫాలో అవుతున్నటువంటి ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు నటి సమంత. సమంత విజయ్ సేతుపతి నయనతార కాంబినేషన్లో దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కణ్మణి రాంబో ఖతిజా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షక ఆదరణ మాత్రం నోచుకోలేకపోయింది.