Nayanthara: నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి గత నెల తొమ్మిదవ తేదీ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా వీరిద్దరూ పెద్దల అనుమతితో మహాబలిపురంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇకపోతే వీరిద్దరూ వివాహం తర్వాత హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట ప్రస్తుతం ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉన్నారు. ఇకపోతే నయనతార పెళ్లికి ముందే చెన్నైలోనీ పోయెస్ గార్డెన్ లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. అయితే తాజాగా అదే ప్రాంతంలో మరొక ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.
చెన్నైలోని పోయెస్ గార్డెన్ అంటే ఇక్కడ కేవలం పెద్ద పెద్ద సెలబ్రిటీలు మాత్రమే నివాసం ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ జయ లలిత శశికళ వంటి వారి నివాసాలు కూడా ఇదే ప్రాంతంలో ఉంటాయి. సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ ప్రాంతంలో నయనతార కోట్లు ఖరీదు చేసే రెండు ఇండ్లను కొన్నట్టు తెలుస్తుంది. ఈ ఇల్లు దాదాపు 8,000 చెదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఉంది. ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ లిఫ్ట్ వంటి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ఇల్లు కొన్ని కోట్ల ఖరీదు చేస్తున్నాయని సమాచారం.

Nayanthara: ఇంటీరియర్ డిజైన్ కోసమే కోట్లు ఖర్చు చేస్తున్న నయన్…
ఇకపోతే కోట్లు ఖరీదు చేసే ఇంటిని కొనుగోలు చేసిన నయనతార ఈ ఇంటిలో ఇంటీరియర్ డిజైన్ చేయించడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. వీరి ఇష్టానికి అనుగుణంగా ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్ ఏర్పాటు చేయిస్తున్నారట ఈ ఇంటీరియర్ డిజైన్ కోసమే నయనతార ఏకంగా 25 కోర్టు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇంటీరియర్ డిజైన్ కోసం ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటేనే ఈమె రేంజ్ ఏందో అర్థమవుతుంది. నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.