Nayanthara పెళ్లి తర్వాత సమంతలా నయనతారకు విడాకులు..వేణుస్వామీ ఏంటీ ఇలా అంటున్నారు..?

G K

Nayanthara : పెళ్లి తర్వాత సమంతలా నయనతారకు విడాకులు తీసుకోక తప్పదంటూ వేణుస్వామీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార మూడవసారి మాత్రం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇటీవలే ఆమె తన కాబోయో భర్తతో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం అక్కడ పెళ్లి కోసం కళ్యాణ మండపం కూడా బుక్ చేసుకున్నట్టు..పెళ్లి తర్వాత సినీ తాలకు, బంధువులకు – సన్నిహితులకు గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

జూన్ 9వ తేదీన నయన్ – విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకునేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో అపశకునం అన్నట్టుగా ప్రముఖ సినీ – రాజకీయ నాయకులకు చెందిన జాతకాలను చూసే ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామీ ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. సమంత – నాగ చైతన్యల మాదిరిగానే త్వరలో ఒక్కటవబోతున్న నయనతార – విఘ్నేష్ శివన్‌లు కూడా విడాకులు తీసుకునే అవకాశాం బలంగా ఉందని చెప్పుకొచ్చారట. దీనికి కారణం నయనతార జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉండటమే అని అంటున్నారు.

Nayanthara పెళ్లి తర్వాత సమంతలా నయనతారకు విడాకులు..వేణుస్వామీ ఏంటీ ఇలా అంటున్నారు..?
Nayanthara పెళ్లి తర్వాత సమంతలా నయనతారకు విడాకులు..వేణుస్వామీ ఏంటీ ఇలా అంటున్నారు..?

Nayanathara: నయన్‌కు పెళ్లి కలిసి రాదా..!

దాంతో సమంత – నాగ చైతన్య, అలాగే, అఖిల్ విషయంలో వేణుస్వామీ చెప్పింది జరిగినట్టే నయన్ – శివన్‌ల జీవితంలోనూ జరగబోతుందా..! అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరికొందరేమో..శుభమా అంటూ పెళ్లి చేసుకోబోతుంటే మీరిలా అపశకునంగా మాట్లాడతారేంటీ అని సోషల్ మీడియా వేదిక ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆయన చెప్పినట్టు నయన్‌కు పెళ్లి కలిసి రాదా..! చూడాలి మరి వేణుస్వామీ చెప్పిన మాటల్లో ఎంత నిజముందో.

- Advertisement -