Nayanthara-vignesh Shivan: దక్షిణాది సినీ ప్రేక్షకులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత లక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక తన అందంతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక నయన కోలీవుడ్లో కూడా మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం అక్కడనే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈమె కొలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ జంట పలు వెకేషన్ లకు, ట్రిప్ లకు వెళుతూ ఆ విషయాలను సోషల్ మీడియాలో కూడా బాగా పంచుకుంటారు. కాగా వీరిద్దరి ర్యాపో ప్రస్తుతం పెళ్లి వరకు వచ్చింది. ఇక జూన్ 9న వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవలే నయనతార తన కాబోయే భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఓ పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట తమ పెళ్లి షాపింగ్, ఆహ్వాన పత్రికలు పంపడంలో బాగా బిజీగా ఉన్నారు. ఇక తమ పెళ్లికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఉంటారని ఇప్పటికే డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డు ను కొందరి అతిథులకు కూడా పంపించారు అని తెలిసింది

Nayanthara-vignesh Shivan: ఆ ఇన్విటేషన్ కార్డ్ డిజైనింగ్ ఇలా ఉందట..
ఆ వీడియో ఇన్విటేషన్ కూడా వైరల్ గా మారిందట. ఇక ఆ పత్రికలో వీరిద్దరి పెళ్ళికి తమిళనాడులో మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో తమ పెళ్లి జరుగుతుందని తెలిసింది. ఇక ఆ ఇన్విటేషన్ కార్డు ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టు పచ్చని చెట్లతో డిజైన్ చేయగా ఆ కార్డు భలే ఉందని అంటున్నారు. ఆ ఇన్విటేషన్ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారగా.. మీరు కూడా ఒకసారి లుక్కేయండి.