Nayanthara-Vignesh Shivan సౌత్ స్టార్ హీరోయిన్ ననయతార మొత్తానికి పెళ్లి పీటలెక్కబోతోంది. తన ప్రియుడు విష్నేష్ శివన్తోజూన్ 9న ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు. తెలుగు తమిళ సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన నయతార సక్సెస్ ఫుల్ కెరీర్లో ఎన్నోఅవమానాలు, కాంట్రవర్సీలు ఉన్నాయి. అవన్నీ తట్టుకొని ముందుకు సాగారు. ఇటు తెలుగులో అటు తమిళంలో భారీ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే తమిళ హీరో శింబుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
కారణాలేవైనా నయన్ – శింబు విడిపోయారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడిన నయన్..పెళ్లి వరకు వచ్చి రద్ధు చేసుకున్నారు. ఇవన్నీ నయనతార కెరీర్లో కోలుకోలేని దెబ్బలనే చెప్పాలి. ఇన్ని కష్టాలను తట్టుకొని హీరోయిన్గా నెట్టుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయన్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. నయన్ కెరీర్లో సక్సెస్‌లే ఎక్కువ. అందుకే, ఆమె ప్రమోషన్స్‌కు రాకపోయినా కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Nayanthara-Vignesh Shivan : కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక గతకొంతకాలంగా తమిళ దర్శక, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న నయనతార గత ఏడాది ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్‌గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. దాంతో సీక్రెట్‌గా నయతార – విఘేష్ శివన్‌ల పెళ్లి కూడా జరిగిపోయిందని పుకార్లు పుట్టాయి. దీనికి నయన్ క్లారిటీ కూడా ఇచ్చారు. అందరికి తెలిసే విధంగానే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అన్నట్టుగానే నేడు తిరుమలకు చేరిన నయన్ – విఘ్నేష్ కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వామి వారి సన్నిధిలోనే వీరి పెళ్లి జూన్ 9న ఘనంగా జరగబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.