Neethu Chandra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటి మనులకు పెద్ద ఎత్తున నిర్మాతలు దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నవారు ఉన్నారు. ఇలా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రమే కాకుండా ఎంతోమంది బడ వ్యాపారవేత్తల నుంచి ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నీతూ చంద్ర ఒకరు. సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా ద్వారా తెలుగు తెలుగ పరిచయమైన ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు.
తెలుగులో కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో నటించిన ఈ నటి వరుసగా తెలుగు, తమిళ, కన్నడ, భోజ్ పురి భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడిపారు. ఈమె సుమారు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వివిధ భాషలలో సినిమాలు చేస్తున్నప్పటికీ ఈమెకు సరైన హిట్ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నీతూ చంద్ర తన సినీ కెరియర్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టోరీ అని తెలిపారు. నేను నా సినీ కెరియర్ లో ఏకంగా 13 జాతీయ అవార్డులు అందుకున్న నటులతో కలిసి పని చేశాను. ఇలా అగ్ర హీరోలతో పని చేసిన నాకు నేడు ఎలాంటి అవకాశాలు లేవని తెలిపారు.
Neethu Chandra: అవకాశాలు రావాలంటే ఆత్మహత్య చేసుకోవాలా…
ఇకపోతే ఒక ప్రముఖ వ్యాపారవేత్త తనకు అవకాశం కల్పించారు. తనకు నెలకు పాతిక లక్షల రూపాయల జీతం ఇస్తానని నేను అతని భార్యగా పని చేయాలని ఆఫర్ కల్పించారు. సినిమాలలో అవకాశం రావాలంటే ఏం చేయాలి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లా ఆత్మహత్య చేసుకోవాలా? పలు సందర్భాలలో తన నిర్ణయమే సరైనదని, తనకు కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఈ సందర్భంగా నీతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.