Nidhi Agarwal: ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ అంటే అందరికీ బాగా తెలుసు. ఒకటి రెండు సినిమాలతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే మొదట ఈమె బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
దీంతో అక్కినేని నాగచైతన్య తో కలిసి నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా తెలుగు సిని పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఆమెకు మొదట్లో అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది.
ఆ సినిమాలు కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. కానీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ సరసన జతకట్టి ఇస్మార్ట్ శంకర్ లో నటించింది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అయినప్పటికీ కూడా అది హీరో ఇంకా డైరెక్టర్ ల ఖాతాలోకి చేరింది.
కానీ నిధి అగర్వాల్ కి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ సినిమా ఆమెకు అంత సక్సెస్ ని తీసుకొని వచ్చి ఉంటే ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చేవి కానీ రాలేదు. ఇక ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేక తమిళంలో పలు సినిమాల్లో నటించింది.
తమిళంలో శింబుతో కలిసి ఈశ్వరన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అంతగా ఫలితాన్ని అందించలేదు. ఆ తర్వాత జయం రవి సరసన భూమి చిత్రంలో నటించింది. అది నేరుగా ఓటీటీ లో రిలీజ్ కావడంతో అది కూడా అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇక ఆ తర్వాత స్టాలిన్ తో జతకట్టి నటించిన కలగ తలైవన్ పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రం కూడా ఈమెకు అంతగా స్టార్ ఇమేజ్ ను తీసుకురాలేకపోయింది. అయితే ప్రస్తుతం నిధి చేతిలో ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీర మల్లు అనే సినిమాలో ఆమె పవన్ కు హీరోయిన్ గా నటిస్తోంది.
Nidhi Agarwal: ధనుష్ తో నటన కోసం పారితోషికం వద్దనుకున్న నిధి అగర్వాల్..
ఇదిలా ఉండగా.. అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో బిజీగా ఉన్న స్టార్ నటుడు ధనుష్ తో జతకట్టాలని ఆశగా ఉన్నట్టు నిధి అగర్వాల్ వ్యక్తం చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనుష్ తో నటించే అవకాశం వస్తే చాలు పారితోషకం కూడా వద్దు అని ఆమె పేర్కొంది. అయితే ఇక ఈ ప్రయత్నం అయినా నిధి అగర్వాల్ కు ఫలించి మంచి విజయాన్ని తీసుకొస్తుంది ఏమో చూడాలి.