Nidhi Agarwal: బెట్ వెయ్యండి.. మజా పొందండి.. నిధి అగర్వాల్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!

Akashavani

Nidhi Agarwal: నిధి అగర్వాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈ సినిమా అనంతరం పలు తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఎన్నో గ్లామరస్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నిధి అగర్వాల్ తన అభిమానులకు ఒక ఈ విషయాన్ని తెలియజేశారు.

Nidhi Agarwal: బెట్ వెయ్యండి.. మజా పొందండి.. నిధి అగర్వాల్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!
Nidhi Agarwal: బెట్ వెయ్యండి.. మజా పొందండి.. నిధి అగర్వాల్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!

Nidhi Agarwal:ఇలాంటివి ప్రమోట్ చేయకండి..

ఈ సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ బెట్ వెయ్యండి మజా పొందండి అంటూ చెప్పడంతో అభిమానులు ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ బెస్ట్ క్రిప్టో స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్ గురించి ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ బెట్టింగ్ సైట్ గురించి తెలియజేస్తూ ఈ సైట్ లో బెట్ చేస్తూ కావలసినంత మజాను పొందండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈమె ఈ బెట్టింగ్ సైట్ గురించి ప్రమోట్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ బెట్టింగ్ సైట్ గురించి స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.దయచేసి ఇలాంటి వాటి గురించి ప్రమోట్ చేయకండి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇలాంటివి చాలా చెడ్డ వ్యసనం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈమె ఈ సైట్ గురించి ప్రమోట్ చేయడంతో ఎంతో మంది విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -