నాగచైతన్య విడాకుల విషయంలో ముందుగానే జోష్యం చెప్పి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన గురించిన పరిచయం ప్రత్యేకంగా మనకి అక్కర్లేదు. ఈయన ప్రముఖుల ఇళ్లల్లో పూజలు చేయిస్తూ నిత్యం బిజీగా ఉంటారు. సెలబ్రిటీలకు జోష్యం చెప్పటంలో ఈ జ్యోతిష్యుడిని ప్రముఖంగా చెప్పుకోవాలి.
అంతేకాక ఆ ప్రముఖుల కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తాడు వేణు స్వామి. ఇంతకుముందు రష్మిక మండన్న తో కూడా పూజలు చేయించారు. అప్పుడు ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా లిస్టులో చేరారు నిధి అగర్వాల్. పింక్ చుడిదార్ లో ఉన్న నిధి అగర్వాల్ తో దగ్గరుండి రాజ్యశ్యామల పూజ చేయించారట వేణు స్వామి.
సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏమిటి తమిళంలో కూడా మంచి అవకాశాలే వచ్చాయి శింబు హీరోగా వచ్చిన ఈశ్వర జయం రవి సరసన భూమి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో కళ్యాణ్ కాంబినేషన్లో నటిస్తున్నారు నిధి అగర్వాల్.
ఈ హీరోయిన్ వేణు స్వామి తో పూజలు చేయించుకొని మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. పూజలు చేయించిన తర్వాత దశ మారినట్లుగా ఆ హీరోయిన్లే ఒప్పుకోవటం విశేషం. ఈయనతో పూజ చేస్తే చాలు కూడా పెరుగుతాయని నమ్ముతున్నారు హీరోయిన్స్. ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి భయపడిని జ్యోతిష్యుడు వేణు స్వామి అదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల ద్వారా తెలియజేశారు.
అందుకే సినీ నటుడు కృష్ణ గారి కుటుంబానికి కూడా దూరమయ్యానని చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన చాలా విషయాలు నిజం కూడా అయ్యాయి. నయనతారకు పెండ్లి అచ్చిరాదని, ప్రభాస్ కి ఈ సంవత్సరం పెద్దగా ఫీట్లు ఉండవని చెప్పి అందర్నీ షాక్ గురి చేశారు వేణు స్వామి. ఈయన చెప్పిన జోష్యం చాలా వరకు నిజం అవుతుండటంతో ఈయన కోసం సెలబ్రిటీలు సైతం క్యూలు కడుతున్నారు.
పలు టీవీ ఛానళ్లు కూడా ఈయనతో ఇంటర్వ్యూలు తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈయన ప్రముఖ వీణ వాయిద్యకారిణి వీణ వాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.