Niharika – Chaitanya: నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక ప్రొఫెషనల్ గా కన్నా పర్సనల్ విషయాలతోనే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. సహజంగానే అల్లరి పిల్ల అయినా నిహారిక తను చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అదే తన కొంపముంచేలాగా ఉంది. నిహారిక చేసే ఈ పని తన అత్తింటి వారికి అంతగా రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నిహారిక – చైతన్య ఈ మధ్య కలిసివున్న ఫోటోలని షేర్ చేయడం లేదు సరి కదా ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని ఎప్పటినుంచో గుసగుసలు వినబడుతున్నప్పటికీ దీనిమీద మెగా కుటుంబం గానీ, ఇటు నిహారిక దంపతులు గాని ఎవరు స్పందించలేదు. అయితే ఇప్పుడు చైతన్య తన ఇంస్టాగ్రామ్ లో నిహారికతో ఉన్న ప్రతి ఫోటోని డిలీట్ చేసేసాడంట.
ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనటానికి ఇదే సాక్ష్యం అంటున్నారు మెగా అభిమానులు. మెగా కుటుంబంలో ఏ విషయానికైనా ముందుగా స్పందించే నాగబాబు ఈ విషయంలో స్పందించకపోవడంతో మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇంస్టాగ్రామ్ లో ఇద్దరూ ఒకరిని ఒకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు.
Niharika – Chaitanya
వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వీరిద్దరికీ సయోధ్య కుదర్చడానికి మెగాస్టార్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. గత సంవత్సరం కూడా వీళ్ళిద్దరు తీసుకోబోతున్నట్లుగా రూమర్స్ వచ్చాయి అయితే చైతన్య వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పిక్ ను ఇంస్టాగ్రామ్ లో పెట్టడం ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టాడు.
ఈసారి అతనే ఫోటోలు డిలీట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. చైతన్య కుటుంబంతో మాట్లాడటానికి చిరంజీవి రంగంలోకి దిగారని వాళ్ళ మధ్య నెలకొన్న ఒక విషయంపై నాగబాబుకి కూడా క్లాస్ పీకారని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఒక మనసు సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక నటిగా ప్రయత్నించి అక్కడ సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.