Niharika: మెగా డాటర్ నిహారిక ఇటీవల తన భర్తకి విడాకులు ఇవ్వనున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఎంతోకాలంగా నిహారిక చైతన్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ స్పందించని నిహారిక తాజాగా తాను తన భర్త నుండి విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో ఒక నోట్ షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం నిహారిక విడాకుల వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా నిహారిక విడాకుల గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ ట్రోల్స్ నిహారిక అన్న వరుణ్ తేజ్ కి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాటి తో వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధమయ్యారు. తొందర్లోనే ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నిహారిక విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో లావణ్య త్రిపాఠి తల్లి వరుణ్ తేజ్ కి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమ్మాయి భర్తకి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటే ఆ ఇంటికి తన కూతురిని కోడలుగా పంపటానికి ఏ తల్లి అంగీకరించదు.

Niharika: వరుణ్ తేజ్ కు కండిషన్ పెట్టిన లావణ్య తల్లి…
కానీ నిహారిక తన భర్తకి దూరంగా ఉంటుందని తెలిసిన కూడా లావణ్య త్రిపాఠి తల్లి తన కూతుర్ని మెగా ఇంటికి కోడలుగా పంపటానికి అంగీకరించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక గురించి వినిపిస్తున్న ట్రోల్స్ ఆమెకు నచ్చటం లేదు. అందువల్ల తన కూతురు నిహారిక తో కలసి ఉండకూడదని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల వివాహం అయిన తర్వాత లావణ్య తో కలసి వరుణ్ తేజ్ వేరు కాపురం పెట్టాలని లావణ్య త్రిపాఠి తల్లి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.దీంతో చెల్లెలి విడాకులు అన్న పెళ్లికి తలనొప్పిగా మారాయి.