Niharika: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తూ మెగా కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడుతూ వస్తున్నారు. అయితే మెగా కుటుంబానికి చెందిన ఆడపిల్లలు మాత్రం ఆ కుటుంబం పరువు తీసే పనులు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకొని ఇద్దరు భర్తలకు దూరమైంది.
ఇక తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. చాలాకాలంగా నిహారిక చైతన్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఆ వార్తలు కేవలం రూమర్ అని కొంతమంది కొట్టి పారేశారు. కానీ తాజాగా నిహారిక ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో విడాకులు వార్తలపై క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉండగా నిహారిక తన భర్తకు దూరం కావటానికి గల కారణాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మెగా కుటుంబం చేసిన పొరపాటు వల్లే నిహారిక తన భర్తకు దూరమైనట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
Niharika: సరైన ముహూర్తానికి పెళ్లి జరగలేదా…
అసలు విషయం ఏమిటంటే 2020లో నిహారిక వివాహం ఉదయపూర్ లో చాలా ఘనంగా జరిగింది. ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వివాహం ఘనంగా జరిపించే క్రమంలో నిహారిక కూడా ఎక్కువ సమయం ఫోటోషూట్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరి జాతకాల ప్రకారం ఒక ప్రత్యేకమైన ముహూర్తంలో జరగాల్సిన వారి పెళ్లి ముహూర్తం దాటిపోయిన తర్వాత జరిగింది. ఇలా ముహూర్తం దాటిన తర్వాత చైతన్య నిహారిక వివాహం జరగటంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురై విడాకులు తీసుకున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది.