Niharika Konidela: నిహారిక కొణిదెల గత కొంతకాలంగా సోషల్ మీడియా వార్తలలో సంచలనంగా మారారు. ఎప్పుడైతే ఈమె తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారో ఆ క్షణం నుంచి ఈమె విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇలా నిహారిక విడాకుల వార్తలు రోజు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఎట్టకేలకు ఈమె విడాకులు తీసుకున్నామని ప్రకటించారు.
ఈ విధంగా నిహారిక తన భర్తకు దూరంగా ఉంటూ విడాకుల కోసం అప్లై చేశారు. అయితే విడాకులు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక పూర్తిగా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె నిర్మాణ సంస్థను ప్రారంభించడమే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు.
ఇక నిహారిక పెళ్లికి ముందు హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా మారిపోయారు.అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మరోసారి వెండితెరపై సందడి చేయాలని భావించారట. ఈ క్రమంలోనే ఒక డైరెక్టర్ సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Niharika Konidela: హీరోయిన్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక…
ఈ విధంగా నిహారిక సినిమాలలో హీరోయిన్ గా నటిస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇందుకు ఒప్పుకోలేదట అయితే కుటుంబ సభ్యులను కూడా కాదని ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయినటువంటి నిహారిక ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఈమె ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేయబోతున్నారు.