Niharika konidela: మెగా డాటర్ గా అందరి చేత పిలిపించుకుంటున్న నాగబాబు ముద్దుల తనయ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె వైవాహిక జీవితం ఒడిదుడుకులలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం చైతన్య, నిహారిక ఇద్దరు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలని డిలీట్ చేయటం.
నిహారిక కూడా అక్క శ్రీజ బాటలోనే పయనిస్తూ భర్తకు విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 2020 డిసెంబర్లో అంగరంగా వైభవంగా జరిగింది నిహారిక పెళ్లి. చూడముచ్చటైన జంట అంటూ అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ జంట. అయితే పెళ్లి అయిన సంవత్సరం నుంచి వాళ్ళిద్దరూ విడిపోతారని రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.
దీని మీద నిహారిక కానీ చైతన్య గాని మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడ నోరు విప్పడం లేదు. తన ప్రతి యద్దుల మీద బోల్డ్ కామెంట్స్ చేసే నాగబాబు.. కూతురి విషయం వచ్చేసరికి పెదవి విప్పటం లేదు. కూతుర్ల వైవాహిక జీవితాలు ఇలా ఉండటం నిజంగా మెగా బ్రదర్స్ కి పెద్ద శాపమే. త్వరలోనే వరుణ్ తేజ్ కి పెళ్లి చేయాలని భావిస్తున్న నాగబాబుకి నిహారిక విషయం ఇబ్బంది కలిగించే విషయమే.
ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వనప్పటికీ కనిపిస్తున్న నిజాన్ని ఎవరు దాయలేరు కదా. వ్యాపార రంగంలో ఉన్న జొన్నలగడ్డ కుటుంబం నిహారిక ప్రవర్తనతో కొంత ఇబ్బందులని ఎదుర్కొంటుందని విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయం గా నిహారిక మామగారు ఆమెని గట్టిగా మందలించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయినా నిహారిక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పట్లోనే వీళ్ళ వైవాహిక జీవితం ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
Niharika konidela:
హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఆ నిర్మాణ సంస్థ నుంచి వెలువడినదే. కళ్యాణ్ కూడా ఆ వ్యవహారాలు చూసుకోవడంలో చాలా యాక్టివ్ గా ఉంటాడంట. ఎప్పుడు కలిసి ఉండే ఫోటోలని షేర్ చేసుకునే నిహారిక దంపతులు చాలా రోజులుగా కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేయకపోవడం వీరి మధ్య దూరం పెరిగింది అనటానికి సాక్ష్యం. దీని మీద మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో అంటూ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.