Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు.. రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక… పోస్ట్ వైరల్!

Akashavani

Niharika Konidela: మెగా ముద్దుల తనయ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా గుర్తింపు పొంది అనంతరం వెండితెరపై సందడి చేశారు.ఇలా వెండితెరపై హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన నిహారిక అనంతరం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ సందడి చేశారు.ఇక జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత ఈమె వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

ఈ క్రమంలోనే తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఈమె చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్దఎత్తున ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే నిహారిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.ఇలా ఉన్నఫలంగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవడంతో పెద్ద ఎత్తున నిహారిక గురించి వార్తలు షికార్లు చేశాయి. ఇలా ఈమె గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు అడ్డంగా పబ్ లో దొరికిపోయి మరోసారి సంచలనంగా మారారు.ఈ విధంగా నిహారిక పోలీసులకు దొరికిపోవడంతో మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో నిహారిక పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు.. రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక... పోస్ట్ వైరల్!
Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు.. రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక… పోస్ట్ వైరల్!

Niharika Konidela: స్వాగతం పలికిన అభిమానులు..

నిహారిక పబ్ లో పోలీసులకు దొరకడంతో మెగా కుటుంబం నిహారిక పై పలు ఆంక్షలు విధించిందనీ,అందుకే నిహారికను సోషల్ మీడియాకు దూరం చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా నిహారిక గురించి ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిహారికకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీంతో నిహారిక ఫోటో చూసిన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ రీ ఎంట్రీ తర్వాత నిహారిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ.. ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, ఇతరులు ఏం చేస్తున్నారనే విషయం గురించి నేను పట్టించుకోను,ప్రస్తుతం తాను ఎంతో రీఫ్రెష్ అయ్యానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక నిహారిక చేసిన ఈ పోస్ట్ పై స్పందిస్తూ వెల్ కమ్ బ్యాక్ అంటూ తనకు స్వాగతం పలుకుతున్నారు.

- Advertisement -