Niharika Marriage Life: నిహారిక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదా.. అందుకే భర్తకు దూరంగా ఉంటోందా?

Akashavani

Niharika Marriage Life: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలం నుంచి నిహారిక ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇంస్టాగ్రామ్ వేదికగా నిహారిక షేర్ చేసిన వీడియో వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఈ వీడియో కారణంగా ఈమెకు నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. ఇలా ఈ ఘటన మరవకముందే మరో సారి పబ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నిహారిక మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు.

ఇలా ఈ మధ్య కాలంలో తరచూ వార్తలలో నిలుస్తున్న నిహారిక పై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా కుటుంబ పరువు తీస్తున్నారు అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా నిహారిక గత కొంతకాలం నుంచి ఒంటరిగా కనిపిస్తున్నారు.పెళ్ళైన మొదట్లో తరచు తన భర్తతో కలిసి ఫొటోలు వీడియోలను అభిమానులతో పంచుకునే నిహారిక ప్రస్తుతం తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా తన భర్త నిహారిక విషయంలో దూరంగా ఉండటం వల్ల గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.

Niharika Marriage Life: నిహారిక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదా.. అందుకే భర్తకు దూరంగా ఉంటోందా?
Niharika Marriage Life: నిహారిక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదా.. అందుకే భర్తకు దూరంగా ఉంటోందా?

Niharika Marriage Life: అరెస్టు విషయంలో స్పందించని చైతన్య…

ఇలా మనస్పర్ధలు రావడం చేత తన వైవాహిక జీవితంపై నాగబాబు స్పందిస్తూ తన కూతురు హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. కానీ నిహారిక మాత్రం తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేదని తెలుస్తోంది.ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోవటం వల్లే తన భర్తకు దూరంగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే తాజాగా రేవ్ పార్టీలో నిహారిక పోలీసులకు దొరికిపోయారు. నిహారికను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఈ ఘటనపై మెగా కుటుంబ సభ్యులు స్పందించిన ఇప్పటివరకు తన భర్త వెంకట చైతన్య స్పందించకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. నిజంగానే నిహారిక చైతన్య మధ్య ఏవైనా మనస్పర్థలు ఉన్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. రేవ్ పార్టీలో నిహారిక అరెస్టు కావడంతో ఇప్పటివరకు ఏ మాత్రం ఈ విషయంపై స్పందించని చైతన్య కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

- Advertisement -