Niharika: మెగా డాటర్ నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తుంది. గత కొంతకాలంగా నిహారిక విడాకుల వార్తలు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు నిహారిక విడాకుల గురించి ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎవరు స్పందించలేదు. దీంతో ఆమె విడాకుల గురించి ప్రేక్షకులలో అనుమానాలు ఉండేవి. తాజాగా ఈ విడాకుల గురించి నిహారిక క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. హిందూ వివాహా చట్ట ప్రకారం జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు కోరుకుంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక చైతన్య విడాకుల వార్తలకు ఎట్టకేలకు ముగింపు కార్డు పడింది. 2020లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన ఏడాదిన్నర వరకు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా జీవించారు. అయితే ఆ తర్వాత నిహారిక రాడిసన్ పబ్ లో పోలీసులు జరిగిన దాడులలో పట్టుబడటంతో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు అనేక వార్తలు వినిపించాయి. అయితే ఆ సమయంలో నిహారిక చైతన్య మధ్య విభేదాలు మొదలైనట్లు కూడా వార్తలు ప్రచారం అయ్యాయి. అయినప్పటికీ నిహారిక చైతన్య మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశారు.
Niharika: పిటిషన్ దాఖలు చేసిన నిహారిక…
ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చి నెలలో చైతన్య తన ఇంస్టాగ్రామ్ నుండి నిహారికతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో వీరి విడాకుల వార్తలు మరొక సారి వినిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి నిహారిక కూడా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయటంతో వీరి విడాకుల వార్తలు మరింత జోరుగా ప్రచారం అయ్యాయి. ఇలా చాలా కాలంగా సోషల్ మీడియాలో విడాకుల గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం వాటి గురించి ఎక్కడ స్పందించలేదు. ఎట్టకేలకు తాజాగా నిహారిక విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.