Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా నిహారిక తన భర్తకు దూరంగా ఉంటుందని తొందరలోనే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నిహారిక కానీ మెగా కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించడం లేదు. దీంతో నిహారిక విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా నిహారిక కూడా కెరీర్ మీద దృష్టి పెట్టింది.
ఇటీవల కొత్త ఆఫీస్ ప్రారంభించిన నిహారిక తాజాగా డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఒకవైపు ఇలా సోషల్ మీడియాలో విడాకుల వార్తలు వైరల్ అవుతుండగా నిహారిక ఆ వార్తల గురించి స్పందించకపోవటమే కాకుండా తన కెరీర్ మీద దృష్టి పెట్టడంతో నిహారిక కూడా సమంతని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో నాగచైతన్యతో మనస్పర్ధలు వచ్చిన తర్వాత సమంత కూడా కొంతకాలం ఇలా నాగచైతన్యకు దూరంగా ఉండటమే కాకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.
Niharika: సమంతనే ఇన్స్పిరేషనా….
ఆ బాధనుండి బయటపడటానికి స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళేది. మొత్తానికి సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఇప్పుడు నిహారిక కూడా అచ్చం సమంత లాగే కెరీర్ మీద ఫోకస్ పెట్టడమే కాకుండా స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇలా విడాకుల విషయంలో నిహారిక సమంతని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక చైతన్య మధ్య వచ్చిన విభేదాలను తొలగించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో చట్టపరంగానే విడాకులు తీసుకోవటానికి నిహారిక సిద్ధపడినట్లు తెలుస్తోంది. తొందర్లోనే వీరి విడాకులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.