Niharika: సినీ ప్రియులకు నిహారిక కొణిదెల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డీ జూనియర్స్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత ఒక మనసు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత అరడజను సినిమాలు లో నటించి తెలుగునాట నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక నిహారిక కొణిదెల ఇటీవల ఒక పబ్ నేపథ్యంలో ఒంటరిగా పోలీసులకు పట్టుబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక తో పాటు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తర్వాత రోజు నిహారిక స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. నిహారిక తప్పు చేసిందో.. తప్పు చేయలేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నిహారికను నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు.
కాగా గతంలో సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉండే నిహారిక ట్రోలర్స్ పెట్టె టార్చర్ తట్టుకోలేక సోషల్ మీడియాకి కొన్ని రోజులుగా దూరంగా ఉంది. ఇక తాజాగా తను వెళ్ళిన జోర్దాన్ ట్రిప్ లో దిగిన స్నాప్ లతో మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే నిహారిక తాజాగా పంచుకున్న ఫోటో సోషల్ మీడియా ప్రియులను ఒక రేంజ్ లో ఆశ్చర్యపరిచింది.
Niharika: నెటిజన్లు నిహారిక ను ఈ విధంగా ఏకిపారేస్తున్నారు!
నిహారిక తన భర్తకు లిప్ లాక్ ఇస్తూ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈ ఫోటోలో కొంచెం బ్లర్ చేసి నెట్టింట్లో ఆరబోసింది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు నిహారిక మీద ఒక రేంజ్ లో నెగిటివ్ కామెంట్లు విసురుతున్నారు. పబ్లిక్ గా ఇటువంటి ఫోటోలు పెట్టడం అవసరమా అంటూ కొందరు కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు.
మరికొందరు నెటిజన్లు మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి ఇలాంటి పనులు చేస్తుందని ఏకిపారేస్తున్నారు. ఇక నిహారిక ఈ కామెంట్లు చూసి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.