Niharika: నిహారిక కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక ఈ మధ్యకాలంలో హీరో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే నిహారిక సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది నెటిజన్లకు టార్గెట్ అయ్యారు.ఈ క్రమంలో నిహారికకు సంబంధించిన ఏ చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పెద్దఎత్తున తనని ట్రోల్ చేస్తుంటారు. గతంలో నిహారిక జిమ్ లో తన ట్రైనర్ తో కలిసి ఉన్న వీడియోని షేర్ చేయడం పెద్దఎత్తున ట్రోలింగ్ కి గురయ్యారు.
ఈ క్రమంలోనే నిహారికను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. గతంలో నిహారిక తన జిమ్ ట్రైనర్ మీద ఎక్కి పుష్ అప్స్ చేసిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు భారీ స్థాయిలో కామెంట్ చేస్తారు. తన గురించి ఇలా నెగటివ్ కామెంట్లు చేయడంతో ఏకంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. అదే విధంగా మరోసారి నిహారిక పబ్ వ్యవహారం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. నిహారిక పలు వివాదాలు ద్వారా వార్తలు నిలవడంతో ఎంతోమంది నెటిజన్లు ఈమెను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Niharika: ట్రావెల్ షో చేయనున్న నిహారిక…
తాజగా నిహారిక మరోసారి జిమ్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి నిహారిక జిమ్ లో సందడి చేశారు. అయితే ఈమె వర్కౌట్ చేయకుండా తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తన జిమ్ ట్రైనర్ మరొక కొత్త జిమ్ సెంటర్ ఓపెన్ చెయ్యగా,తన జిమ్ ట్రైనర్ కి నిహారిక దంపతులు కంగ్రాట్స్ చెబుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ యాప్‌లో ట్రావెల్ షో నిర్వహిస్తుందని తెలుస్తుంది. అందుకే నిహారిక తన భర్తతో కలిసి జోర్దాన్ ట్రిప్ వెళ్ళినట్లు సమాచారం.