Niharika: ప్రముఖ యాంకర్, నటి నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అంటే అందరికీ బాగా తెలుసు. ఈ మెగా డాటర్ మొదట యాంకర్ తన కెరీర్ ను మొదలుపెట్టింది. పలు షోలకు హోస్ట్గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తర్వాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ నటిగా అయితే నిహారికకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు తమిళంలో కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించింది.
2019లో సూర్యకాంతం అనే సినిమాల్లో కూడా ఆమె గయ్యాలిగా అల్లరి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నిహారిక చివరగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇక నటిగా బిజీ అవుతుంది అనుకున్న తరుణంలో ఆమెకు పెళ్లి జరిగింది. నిహారిక భర్త ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయినా చైతన్య జొన్నలగడ్డ. అతన్ని పెళ్లి చేసుకున్న ఆమె పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లోకి అయితే ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది.
అలాగే చిన్న బడ్జెట్లో కూడా సినిమాలను నిర్మించడానికి భర్తను ఒక బిజినెస్ పార్ట్నర్ గా కూడా చేసుకుంది. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడంతా నిహారిక తన భర్తతో కలిసి కొన్ని స్పెషల్ లోకేషన్స్ కు కూడా వెళుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా తన స్నేహితులతో కలిసి ఆమె టర్కీల్లోని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళింది.
అక్కడ ఈమె ఒక బీచ్ ఒడ్డున హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అక్కడ తన స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో నిహారిక టాప్ బికినీలో కనిపించింది.
దీంతో భర్త లేకుండా ఈమె ఒంటరిగా తిరుగుతుందా..? నిహారిక కు నిహారిక భర్త కు మధ్య విభేదాలున్నాయా? వీరిద్దరి మధ్య దూరం పెరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతంలో నిహారిక ఓ పబ్ పార్టీలో డ్రగ్ కేసులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే.
Niharika: నిహారిక, చైతన్యలు విడిపోతున్నారా..
ఇక అప్పటినుంచి నిహారిక అలాగే చైతన్యల మధ్య దూరం పెరిగిందని వాళ్ళు విడిపోబోతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మళ్లీ సింగిల్ గా నిహారిక ట్రిప్పులు లతో తిరుగుతుండడంతో వీరిద్దరి మధ్య దూరం ఉందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు.