Niharika: స్వర్గాన్ని వెతుక్కుంటానంటున్న నిహారిక.. దారుణమైన కామెంట్లు విసిరిన నెటిజన్లు!

Akashavani

Niharika: తెలుగు ప్రేక్షకులకు కొణిదెల క్వీన్ నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై హోస్ట్ గా ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుని నిర్మాతగా కూడా పలు వెబ్ సిరీస్ లకు ప్రాణం పోసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇక ఈ అమ్మడు అందానికి అడపాదడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తన సొంతం చేసుకుంది. ఇక నిహారిక సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్లు నెట్టింట్లో పంచుకుంటుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు పబ్ వ్యహారంలో పోలీసుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. ఇక తప్పో ఒప్పో ఆ తర్వాత పోలీసులు నిహారిక ను వదిలి పెట్టారు.

అప్పటి నుంచి నిహారిక సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. దీనికి బలమైన కారణమే ఉంది. పోలీసులు వదిలి నప్పటికీ .. నిహారిక ను ఇన్ స్టాగ్రామ్ మీమర్స్ వదలడం లేదు డైలీ ఏదో ఒక మీమ్ ద్వారా నిహారిక ను దెప్పి పొడుస్తూనే ఉన్నారు. కాగా నిహారిక కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.

Niharika: స్వర్గాన్ని వెతుక్కుంటానంటున్న నిహారిక.. దారుణమైన కామెంట్లు విసిరిన నెటిజన్లు!
Niharika: స్వర్గాన్ని వెతుక్కుంటానంటున్న నిహారిక.. దారుణమైన కామెంట్లు విసిరిన నెటిజన్లు!

Niharika: నెటిజన్లు నిహారికను ఈ విధంగా దెప్పి పొడుస్తున్నారు!

ఇక తాజాగా నిహారిక సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు జోర్డాన్ ట్రిప్ ను ట్రిప్ ను చిల్ అవుతూ దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో పంచుకుంది. అంతేకాకుండా నేను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను అని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నిహారిక ను ఒక రేంజ్ లో కామెంట్ల రూపంలో హర్ట్ చేస్తున్నారు.

గుడికి వెళ్లలేదా ప్రసాదం తీసుకోవడం లేదా..అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఇంకో సారి దొరికితే నిజమైన స్వర్గం కనిపిస్తుంది లే అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

- Advertisement -