Niharika: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తాజాగా ఈ అమ్మడు తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకాలం విడాకుల గురించి అనేక వార్తలు వినిపించినప్పటికీ నిహారిక ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా చైతన్యతో విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో ఒక నోట్ షేర్ చేసి విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అలాగే చైతన్య కూడా నిహారికతో సామరస్యంగా విడిపోతున్నట్లు ఒక నోట్ షేర్ చేశాడు. ఇలా ప్రస్తుతం వీరిద్దరూ షేర్ చేసిన ఈ నోట్ తో విడాకుల వార్తలపై అందరికీ క్లారిటీ వచ్చింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే మెగా కుటుంబంలో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకొని కుటుంబం పరువు తీసింది. మొదటి భర్తతో ఒక బిడ్డని కన్న శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ఇద్దరికీ విడాకులు ఇవ్వటంతో ఇద్దరు పిల్లలు శ్రీజ తోనే కలసి ఉంటున్నారు. చిరంజీవి తన కూతురు మనవరాళ్ల బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో నిహారిక కూడా తన అక్క లాగే చైతన్యకి విడాకులు ఇచ్చింది. అయితే ఒక విషయంలో మాత్రం తన అక్క చేసిన పొరపాటు చేయకుండా నిహారిక జాగ్రత్త పడింది.
Niharika: పిల్లల విషయంలో జాగ్రత్త పడిన నిహారిక..
2020లో నిహారిక చైతన్య- వివాహం జరిగింది. వివాహం తర్వాత కొంతకాలం వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో ఇద్దరు కలిసి ఉండలేమని నిహారిక ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భర్తకి దూరమైన కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే పిల్లల్ని కనకపోవటం. పెళ్లి జరిగిన వెంటనే పిల్లల కోసం నిహారిక కొంతకాలం టైం తీసుకోవడానికి భర్తని ఒప్పించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి భర్తతో విభేదాలు రావడంతో తనతో ఎలాగో కలిసి ఉండలేనని భావించిన నిహారిక తనకి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.