Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి తెలియని వారు అంటూ ఉండరు. మెగా కుటుంబ నియమాలకు విరుద్ధంగా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక సరైన గుర్తింపు రాకపోవడంతో నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. పెళ్లి తర్వాత భర్త కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పింక్ ఎలిఫెంట్ అని బ్యానర్స్ స్థాపించి వెబ్ సిరీస్ సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చిరంజీవి కూతురు సుస్మిత కూడా నిర్మాతగా మారింది. ఆమె అడుగు జాడల్లోనే నిహారిక కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది
ఒకవైపు నిహారిక, చైతన్య విడాకుల వార్తలు వైరల్ అవుతున్న సమయంలో నిహారిక తన కెరీర్ మీద దృష్టి పెట్టటం అందరిని ఆలోచనలో పడేసింది. గత కొంతకాలంగా నిహారిక, చైతన్య విడాకుల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ మెగా కుటుంబ సభ్యులు ఎవరు ఈ వార్తలపై స్పందించలేదు. అయితే నిహారిక సోషల్ మీడియాలో తన భర్తని అన్ ఫాలో చేయగా అటు చైతన్య కూడా తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలతో పాటు నిహారికతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఆమెని అన్ ఫాలో చేశాడు.
Niharika: కెరియర్ పై ఫోకస్ పెట్టిన నిహారిక…
ఈ పరిణామాలు చూస్తుంటే నిహారిక చైతన్య విడాకులు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్లు అందరికీ అర్థమవుతుంది. ఇలా విడాకుల వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో నిహారిక నిర్మాతగా నిలదొక్కుకోవడానికి కొత్త బ్యానర్ లో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిహారిక ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ తో నిహారిక చర్చలు జరుపుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటిగా రాణించ లేకపోయినా కూడా నిహారిక నిర్మాతగా రానిస్తుందని మెగ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.