Niharika: మెగా డాటర్ నిహారిక తన వ్యక్తిగత విషయాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం తర్వాత వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే గత కొంతకాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారని ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వీరి విడాకులు వార్తలు బయటకు వచ్చిన ఈ విషయంపై ఎవరు స్పందించలేదు.
విడాకులు తీసుకున్నారని ఈ విషయాన్ని బయట పెట్టలేదని పలువురు భావిస్తున్నారు. అయితే నిహారిక తన భర్త ఇద్దరు కూడా పరోక్షంగా విడాకులు తీసుకున్నామని తెలియజేశారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తమ పెళ్ళి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో కచ్చితంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మాత్రం ఇండస్ట్రీలో తన దూకుడు కనబరుస్తున్నారు. వరుస సినిమాలలో నటించి వెబ్ సిరీస్ లను చేస్తున్న నిహారిక ఎంతో బిజీగా ఉన్నారు.
Niharika: కనిపించని నిహారిక…
ఇకపోతే తాజాగా మరోసారి నిహారిక చైతన్య విడాకుల గురించి వార్తలు అవుతున్నాయి.జొన్నలగడ్డ వెంకట చైతన్య చేసిన పని కారణంగా చైతన్య నిహారిక ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో నిహారిక నిర్మాణ సంస్థను స్థాపించిన జొన్నలగడ్డ వెంకట చైతన్య కనిపించలేదు. అయితే తాజాగా జొన్నలగడ్డ వెంకట చైతన్య కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్లారు కానీ నిహారిక మాత్రం కనిపించకపోవడంతో వీరిద్దరూ పక్కాగా విడాకులు తీసుకున్నారని ఈ ఘటనతో క్లారిటీ వచ్చేసింది దీంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.