Niharika: మెగా డాటర్ నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇలా కొంతకాలం పాటు బుల్లితెర యాంకర్ గా కొనసాగినటువంటి ఈమె సినిమా అవకాశాలను అందుకొని మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఏకైక హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఈమెను హీరోయిన్గా మెగా ఫాన్స్ ఏమాత్రం అంగీకరించకపోవడంతో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయారు. ఇలా హీరోయిన్ గా కెరియర్లో ముందుకు కొనసాగ లేకపోవడంతో నిహారికకు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా వివాహం చేశారు.
ఈ విధంగా వివాహం చేసుకున్నప్పటికీ సినిమాలపై ఆసక్తి తగ్గకపోవడంతో ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించి నిర్మాతగా మారారు. అయితే తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం మెగా కుటుంబానికి దూరం కాబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే తన అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఉండగా ఈమె మాత్రం మెగా కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లిపోయారని తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు చూస్తే అర్థమవుతుంది.
విదేశాలకు పయనమైన నిహారిక…
విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక ఇలా ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వెకేషన్ కి వెళ్తే కనుక తప్పకుండా తన స్నేహితులను వెంట తీసుకొని వెళ్లేవారు కానీ నిహారిక ఇలా ఒక్కతే విదేశాలకు వెళ్తున్నారు అంటే విడాకుల విషయంలో మెగా కుటుంబం తనపై ఏమైనా సీరియస్ అయ్యారా అందుకే కుటుంబానికి దూరంగా ఉండబోతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి అదేవిధంగా మరికొందరు ఈమె ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగడం కోసం మరింత శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా నిహారిక ఇలా ఉన్నఫలంగా విదేశాలకు వెళ్లడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.