Niharika -Venkata Chaitanya: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన అంశం ఇలా ఎంతో మంది సెలెబ్రేటీలు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇదివరకే రెండుసార్లు పెళ్లి చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం మరో మెగా డాటర్ కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని 2020 డిసెంబర్ నెలలో జైపూర్లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరిపించారు.ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక వివాహం మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగింది.వివాహం తర్వాత నిహారిక ఎంతో సంతోషంగా వైవాహిక జీవితంలో గడుపుతూ వచ్చారు. నిహారిక ఏకంగా విడాకులు తీసుకొని భర్త నుంచి దూరం కాబోతుందన్న వార్త మెగా అభిమానులకు మింగుడు పడటం లేదు. అయితే ఇలాంటి అనుమానాలు రావడానికి గల కారణం ఇంస్టాగ్రామ్ లో వీరి పెళ్లి ఫోటోలను నిహారిక భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య డిలీట్ చేయడమే కారణం.
Niharika -Venkata Chaitanya పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన చైతన్య…
ఇలా పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో నిహారిక చైతన్య ఇద్దరు కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ దూరంగా ఉండడమే కాకుండా పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇలా విడాకులకు సిద్ధమయ్యారని పలువురు భావిస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో మెగా కుటుంబంలో దివాళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలలో ఎక్కడ కూడా వెంకట చైతన్య కనిపించకపోవడం గమనార్హం. అలాగే నిహారిక వెకేషన్ వెళ్ళినా కూడా ఒంటరిగానే వెళ్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు కూడా కాస్త దూరం అయ్యారు. ఇలా ఈ సంఘటనలన్నీ కూడా వీరి విడాకుల విషయం గురించి పెద్ద ఎత్తున అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరి వీరి విడాకుల విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.