Nirupam Paritala: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిన తర్వాత సినిమా నటులు మాత్రమే కాకుండా బుల్లితెర నటులు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. అలా బుల్లితెర ద్వారా బాగా గుర్తింపు పొందిన వారిలో నిరుపమ్ పరిటాల ఒకరు. మా టీవిలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో నటించిన నిరుపమ్ పరిటాల సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ డాక్టర్ బాబు గా బాగా గుర్తింపు పొందాడు. మొట్టమొదట ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిరుపమ్ తర్వాత మూగ మనసులు, కలవారి కోడళ్లు, కుంకుమపువ్వు, హిట్లర్ గారి పెళ్ళాం వంటి పలు సీరియల్స్ లో నటించాడు. కానీ కార్తీక దీపం సీరియల్ నిరుపమ్ కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఇలా సీరియల్స్ లో నటిస్తూ బాగా పాపులర్ అయిన నిరుపమ్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నాడు. అయితే కొంతకాలం క్రితం కార్తీకదీపం సీరియల్ లో తన క్యారెక్టర్ ముగియడంతో ప్రస్తుతం ఆ సీరియల్ లో కనిపించడం లేదు. నిరుపమ్ భార్య మంజుల కూడా ఒక టీవీ ఆర్టిస్ట్. చంద్రముఖి సీరియల్ లో కలిసి నటించిన వీరిద్దరూ జీవితంలో వివాహం చేసుకొని భార్యాభర్తలుగా మారారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఏంతో మంది నటులు తమ పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు. అందరిలాగే నిరుపమ్ కూడా అతని భార్యతో కలిసి తరచు వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరౌతున్నారు.

Nirupam Paritala: సమ్మర్ స్పెషల్…
మంజులనిరుపమ్ అనే సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా ఫన్నీ వీడియోలు, హోం టూర్, షాపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేస్తూ నిత్యం సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఈ జంట. ఇటీవల వీరిద్దరు సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి చేస్తూ సందడి చేశారు. ఈ వీడియోలో మంజుల గారు, ఆమె అత్త గారు కలిసి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టుకునే విధానం గురించి తెలియచేశారు. ఇలా తరచూ అన్ని విషయాలకు సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటారు. ఇటీవల వైజాగ్ లో ఐస్క్రీమ్ దోస గురించి కూడా వీడియో చేసి అప్లోడ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.