Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈయన తన తదుపరి సినిమాని వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయగా,వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం వక్కంతం వంశీ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నితిన్ తాజాగా తన మూడవ వెడ్డింగ్ యానివర్సరీలో భాగంగా తన భార్యతో కలిసి బార్సిలోన వెకేషన్ వెళ్లారు. ఇలా ఈ వెకేషన్ లో భాగంగా నితిన్ షాలిని ఇద్దరు కలిసిఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వెకేషన్ ఫోటోలను శాలిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా ఈమె ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో భాగంగా నితిన్ కౌగిలిలో షాలిని బంధి అయిన ఫోటోని షేర్ చేస్తూ.. మూడేళ్లు ఎంతో అందంగా గడిచాయి థాంక్యూ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.
Nithin: క్లియర్ గా కనిపిస్తున్న బేబీ బంప్…
ఇక ఈ ఫోటో కనుక చూస్తే ప్రతి ఒక్కరు కూడా శాలిని ప్రెగ్నెంట్ అని భావిస్తున్నారు. ఈ డ్రెస్ లో శాలిని బేబీ బంప్ ఉన్నట్టు కనిపించడంతో అందరూ నితిన్ తండ్రి కాబోతున్నారంటూ భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ ప్రకటించడం లేదని తెలుస్తోంది ఇలా ఈ ఫోటోలో షాలిని బేబీ బంప్ ఉన్నట్టు కనిపించడంతో త్వరలోనే నితిన్ గుడ్ న్యూస్ అందరితో పంచుకోబోతున్నారని తెలుస్తుంది. మరి నితిన్ తండ్రి కాబోతున్నారనీ వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ వార్తలపై నితిన్ స్పందించాల్సి ఉంది.