NTR 30: జనతా గ్యారేజ్ సినిమా తర్వాత చాలా సంవత్సరాలకి కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ 30 సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కొరటాల కూడా ఆచార్య మూవీ తో భారీ పరాజయాన్ని మూట కట్టుకొని ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడం.
అలాగే అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇదే సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి విశేషాలతో కూడుకున్న సినిమా కావటంతో ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. తీరాప్రాంత ప్రజల కష్ట నష్టాలు కథాంశంతో ఈ కథ తెరకెక్క పోతుందని ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా టాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయం మీద అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఈ సినిమాకి సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తుండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలో ప్రముఖ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఉంటారు. హైదరాబాదులో ప్రారంభమైన చిత్రం తొలి షెడ్యూల్ ముగించుకుని తర్వాత షెడ్యూల్ గోవాలో చిత్రీకరిస్తారని సమాచారం.
NTR 30:
ఇక ఈ సినిమా షూట్ ను ముఖ్యంగా హైదరాబాద్ వైజాగ్ గోవాలో వేసిన సెట్లో జరుపనున్నారు. వి ఎఫ్ ఎక్స్ కూడా భారీగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ 30 సెమి పీరియడ్ సెట్ అప్ తో ఓ ఫిక్షనల్ ఐలాండ్లో జరుగుతుందని దీనికి పోర్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని వర్గాల సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ప్రత్యర్థిగా విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం. దీని గురించి కూడా అధికారికంగా వార్తలు రావాల్సి ఉంది.