Ntr -Anushaka: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఇక ప్రభాస్ తో నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పలు చిత్రాలతో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుష్క బాహుబలి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
చాలా రోజుల తర్వాత నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు .ఇదిలా ఉండగా తాజాగా అనుష్క గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ సినిమాలలోనూ నటించారు. అయితే ఇప్పటివరకు ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో కూడా నటించలేదు.
Ntr -Anushaka: అనుష్క ఛాన్స్ మిస్ చేసుకున్నారా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈయన సినిమాలో అనుష్క నటించిన పోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే..అనుష్క కెరియర్ మొదట్లో ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు వచ్చాయి అయితే అప్పుడు ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండడంతో ఫిజిక్స్ పరంగా వీరిద్దరికీ మ్యాచ్ అవ్వకపోవడంతో అనుష్క ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా మారిన అనుష్క మాత్రం కాస్త బొద్దుగా తయారయ్యారు అంతేకాకుండా ఈమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశాలు కూడా రాకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్లు ఇప్పటివరకు సినిమాలు రాలేదు.