NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మీప్రతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా రెండవ కుమారుడు భార్గవ్ రామ్. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఎన్టీఆర్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ కి ఫస్ట్ కుమారుడు జన్మించిన సమయంలో ఎంతో సంతోషపడిన ఈ దంపతులు రెండవ కుమారుడు జన్మించిన సమయంలో చాలా బాధపడ్డారట. ఇలా ఎన్టీఆర్ రెండో కుమారుడు జన్మించినప్పుడు అంతగా బాధపడాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి ఇద్దరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టమట తనకు అమ్మాయి ఉంటే బాగుండేదని ఎన్నో కలలు కన్నారు కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో మరీ అబ్బాయి పుట్టారని లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ ఇద్దరు బాధపడ్డారట.
NTR: కూతురు లేని లోటు ఉంది..
ఇలా ఎన్టీఆర్ కి కూతురు లేదనే బాధ ఇప్పటికీ ఉంది ఇలా కూతురు కావాలనే తన భార్య కోరిక ఎన్టీఆర్ తీర్చలేకపోయారట. పిల్లల విషయంలో తమకు కూతురు లేరు అనే లోటు అలాగే మిగిలిపోయిందని ఇలా ఆ బాధ తమకు ఇప్పటికీ ఉందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఇక ఎన్టీఆర్ పిల్లల ఫోటోలను పెద్దగా సోషల్ మీడియాలో షేర్ చేయరు. ఏదైనా ఫంక్షన్ల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో మాత్రమే వీరి ఫోటోలు బయటకు వస్తుంటాయి.