NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ ఇతర సెలబ్రిటీలతో ఎంతో సరదాగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అలాగే ఇతరుల పట్ల చాలా మర్యాదపూర్వకంగా నడుచుకొనే వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది.
ఎంతో మంచి నడవడికతో ఉండే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోయిన్ కి ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పారట.ఇలా తారక్ క్షమాపణలు చెప్పే అంత తప్పు ఏం చేశారు? ఎందుకు ఆ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పారు అసలు ఎవరు ఆ హీరోయిన్ అనే విషయాన్ని వస్తే…రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రియమణి మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం యమదొంగ. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ నటించారు.
NTR: మమతా మోహన్ దాస్ కి క్షమాపణలు చెప్పిన తారక్..
ఈ సినిమాలో ఓలమ్మి తిక్క రేగిందా అనే పాట ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాటలో ఎన్టీఆర్ మమతా మోహన్ దాస్ కి
బ్యాక్ ను వాయించి వదిలేసాడు తారక్. డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఇలా చేశాడు అయినా కూడా ఎక్కడాఆమె హార్ట్ అయిందోనని ఈ సినిమా పాట షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్లి మరి ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి క్షమాపణలు కోరారట.ఇలా ఎన్టీఆర్ గురించి ఈ వార్త వైరల్ కావడంతో ఆయన ఇతర సెలెబ్రిటీల పట్ల ముఖ్యంగా హీరోయిన్ల పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్థం అవుతుంది.