NTR:తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తారక్ ప్రస్తుత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతేఎన్టీఆర్ తాజాగా తన సోదరి సుహాసిని కుమారుడి వివాహ వేడుకలలో చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
ఈ విధంగా ఎన్టీఆర్ స్టైలిష్ లోకి చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సాధారణంగా ఎన్టీఆర్ కి వాచ్లు అంటే ఎంతో ఇష్టం అనే విషయం మనకు తెలిసిందే. వాచ్ ల కోసం ఈయన కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తన మేనల్లుడికి పెళ్లి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ వాచ్ గురించి వివరాలు సేకరించారు.
NTR: కోట్ల విలువ చేసే వాచ్…’
ఈ పెళ్లి వేడుకలలో ఎన్టీఆర్ చేతికి ధరించిన ఈ వాచ్
స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ వాచ్ అని తెలుస్తోంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నప్పటికీ, దీని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. నిజానికి ఈ బ్రాండ్లో లభించే ప్రతీ వాచ్ కూడా ఇదే స్థాయిలో ధర పలుకుతూ ఉంటాయి.ఈ విధంగా ఎన్టీఆర్ ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల విలువచేసే వాచ్ కట్టుకున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తారక్ దగ్గర ఉన్నటువంటి వాచ్ ల విలువ సుమారు కొన్ని కోట్లలో ఉంటాయని చెప్పాలి.