NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా కొనసాగుతున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది ప్రస్తుతం తారక్ ఒక్కో సినిమాకి దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ మంచితనంలో మారాజు అని చెప్పాలి.
ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎంత మొత్తంలో డబ్బు సంపాదించారనే విషయానికి వస్తే… ఎన్టీఆర్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది.సర్వేల ప్రకారం ఎన్టీఆర్ ఇప్పటివరకు దాదాపు 450 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టియన చాలా సింపుల్ గా అందరితో చాలా సరదాగా వ్యవహరినట్లు తెలుస్తోంది. ఇలా ఇంత మొత్తంలో ఆస్తులు ఉన్నప్పటికీ ఈస్తూ ఉంటారు. మరి ఎన్టీఆర్ కి విలువైనటువంటి ప్రాపర్టీస్ ఏవేవి ఉన్నాయనే విషయానికి వస్తే…
NTR: భారీగా ఆస్తులు పోగుచేసిన తారక్..
తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉంది. అలాగే లంబోర్గినీ ఉరస్ కార్ ఉంది. దాని ధర రూ. 3 కోట్లు. అంతేకాకుండా.. 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ రేంజ్ రోవర్ విలువ రూ. 2 కోట్లు 2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 1 కోటి విలువైన పోర్షే మెర్సిడెస్ బెంజ్ విలువ కోటి రూపాయలు చేస్తుంది. వీటితో పాటు కొన్ని కోట్ల ఖరీదు చేసే వాచెస్ కూడా ఎన్టీఆర్ వద్ద ఉన్నాయి ఎన్టీఆర్ కు వాచ్ కలెక్షన్ అంటే ఎంతో ఇష్టం ఉండటం చేత ఇలా భారీ స్థాయిలో డబ్బులను ఖర్చు చేసి వాచీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్టీఆర్ వ్యక్తిగతంగా లగ్జరీ లైఫ్ గడుపుతున్నప్పటికీ బయటకు మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ కలిసిపోతూ ఉంటారు.