NTR: నందమూరి తారక రామారావు వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే హీరోగా సక్సెస్ అయ్యారు. అయితే హరికృష్ణ కుమారుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నందమూరి పరువు ప్రతిష్టలను కాపాడుతున్నారని చెప్పాలి.నందమూరి వారసుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.హాలీవుడ్ డైరెక్టర్లు సైతం తనతో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పడంతోనే ఈయన క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన కెరియర్ పరంగా ఎంతో గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు కానీ సొంత కుటుంబ సభ్యులే ఈయనని దూరం పెడుతూ అవమానిస్తున్నారు. ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య కొడుకు కావడమే అందుకు కారణమని చెప్పాలి.ఎన్టీఆర్ కుటుంబం మొదటి నుంచి ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ కావడంతో పలువురు ఈయనకు దగ్గరవుతున్నారు. ఇక తాత పేరు ప్రతిష్టలను ఎంతో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తున్న ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబం నుంచి అవమానాలు ఎదురవుతున్నాయి.

NTR:  ఎన్టీఆర్ కు అందని ఆహ్వానం…

తాజాగా నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి ఎంతో మంది టిడిపి కార్యకర్తలు నేతలు సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు కానీ సొంత కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదు. ఇలా ఎన్టీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారని పలువురు అభిమానులు భావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఎన్టీఆర్ ను దూరం పెట్టడం మీకే నష్టమని పలువురు తెలుపుతున్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవం పొందాలి అంటే తారక్ అవసరం ఎంతో ఉందని అయితే ఆయనని దూరం పెడితే అది మీకే మంచిది కాదంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఏప్రిల్ 29, 2023 at 4:45 సా.