NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాతో ఈయన గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. RRR సినిమా ద్వారా హాలీవుడ్ డైరెక్టర్లను కూడా మెప్పించిన ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా ప్రముఖ ఛానెల్ కు జేమ్స్ గన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
NTR: ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉంది…
గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు జేమ్స్ సమాధానం చెబుతూ… గత ఏడాది బిగ్ సినిమాగా నిలిచిన RRR నటుడు బోనులో నుంచి పుల్లలతో బయటకు వచ్చే వ్యక్తితో పనిచేయాలనుకుంటున్నానని,ఏదో ఒక రోజు తప్పకుండా తనతో సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ హాలీవుడ్ డైరెక్టర్లు సైతం చెప్పడంతో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.