NTR: జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే యూత్ ఉర్రూతలూగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా ఆ ఊపుని మరింత పెంచేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆస్కార్ విన్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం ఆయన మీదే దృష్టి సారించారు. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా ద్వారా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత బాలల రామాయణం లో రాముని పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
చిన్నతనంలోనే తాతగారి నటవరసత్వాన్ని నిలబెట్టాడు. ఇక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. కెరియర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా మళ్ళీ కెరియర్ ని ఫామ్ లోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. దక్షిణాదిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. అందుకే ఇప్పటికి చాలానే కూడాబెట్టాడు. ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ 571 కోట్లు. ఈయన నెలకి మూడు కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కొక్క సినిమాకి పది నుంచి 12 కోట్లు తీసుకునేవారు కానీ ఆర్ఆర్ఆర్ మూవీకి రామ్ చరణ్ తో పాటు తను కూడా భారీగా తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన బంగ్లాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయన వ్యాపార ప్రకటనల ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. దీనికి హైదరాబాదులోనే కాకుండా బెంగళూరులో కూడా విలువైన ఆస్తులు ఉన్నాయి.
NTR:
హైదరాబాద్ ఔట్స్కట్స్ లో గోపాలపురం లో బృందావనం అనే పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈయనకి రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 720 ఎల్డీ, నాలుగు కోట్ల విలువైన రీచార్జ్ మిళ్లే f1 తో పాటు ఖరీదైన వాచీలు. వీటితోపాటు ఖరీదైన కార్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి. అన్నిట్లోని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రైవేట్ జెట్ దాని కాస్ట్ 8 కోట్లు. ఇక దక్షిణాదిన పేమెంట్ తీసుకుంటున్న నటుల్లో , అలాగే ఎక్కువ టాక్స్ లు చెల్లిస్తున్న నటుల్లో ఈయన ఉండడం గమనార్హం.